పలమనేరు: టీ.వడ్డూరులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండపంలో శనివారం రాత్రి తమిళనాడు నుండి పిలిపించిన ఐదు మంది మహిళలచే డాన్స్ ప్రోగ్రాం పెట్టించారు నిర్వాహకులు. అది మోతాదు మించి అశ్లీల నృత్యాలుగా మారింది యువత నృత్యం చేస్తున్న మహిళలతో పాటు డాన్సులు చేశారు. ఈ ఘటన ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. వినాయక చవితి ముందు రోజు డి.ఎస్.పి డేగల ప్రభాకర్ మరియు ఆర్డీవో ప్రెస్ మీట్ పెట్టి మరి వినాయక విగ్రహాల ముందు రికార్డింగ్ డాన్సులు అశ్లీల నృత్యాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కానీ ఇక్కడ నిర్వాహకులు మాత్రం అవేవీ పట్టనట్టు మహిళలచే నృత్యాలు చేశారు.