రాత్రి సమయంలో షట్టర్ పైకి లేపి దొంగతనం చేసిన నిందితులను గురువారం సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ కేసు వివరాలు తెలియపరుస్తూ..ఈ నెల 12వ తేదీన సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజెఆర్ చౌక్ దగ్గర లోని వైష్ణవి మెడికల్ షాపు మరియు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరి హర మెడికల్ షాపులో షట్టర్ పైకి లేపి దొంగతనం జరిగింది. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా సిద్దిపేట 2 టౌన్ పోలీస్ లు మరియు CCS పోలీసులు గురువారం నలుగురు ముద్దాయిలు అయిన రాజమండ్రి కి చెందిన ఇందుకూరి సూర్య, తోగుట మండలం గుడికందుల గ్రామా