ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండల వ్యాప్తంగా భారీ వర్షం..గోనెగండ్ల మండల వ్యాప్తంగా తెల్లవారుజామున నుంచి భారీ వర్షం మొదలైంది. అల్వాల, పెద్ద నేలటూరు, కులుమాల గ్రామాల్లో దంచికొడుతోంది. 10 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానిక అధికారులు తెలిపారు.