కామారెడ్డి జిల్లా కేంద్రంలో గడిచిన 13గం నుండి ఎడతెరాపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి హోసింగ్ బోర్డు కౌండిన్య ఎన్క్లేవ్ లో రాత్రి నుండి ఇళ్లలో నీరు ప్రవహిస్తున్నాయి. ఆ ప్రాంత గుడి పంతులు, కాలనీ వాసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చిన సహాయం కోసం ఎవరు రావడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా వాటర్ ట్యాంక్ పైన ఎక్కి నిల్చున్నారు. మరికొందరు ఇండ్ల పైకప్పు పై నిలుచుండి అధికారుల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. నీరు రోడ్లపై ఎక్కువగా ప్రవహిస్తుండడంతో కార్లు సైతం నీటిలో మునిగిపోయి కొట్టుకుపోతున్నాయి. అధికారులు స్పందించాలని కోరుతున్న ప్రజల