వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చందోలు ఎస్సై వెంకట శివ కుమార్ ఆదివారం ఉన్నారు. ఈ సందర్భంగా వెంకట శివకుమార్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలలో డీజే సౌండ్స్ ఉపయోగించరాదని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు సహకరించాలని కమిటీ నిర్వాహకులను సూచించారు.