కొయ్యూరు మండలంలోని కొండగోకిరి పంచాయతీ పరిధిలో ఉన్న పాడి గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో ఉన్న కొండవాగుపై వంతెన నిర్మించాలని మంగళవారం సాయంత్రం జుర్రా శివకుమార్, పలువురు స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండవాగు ఉప్పొంగి, ఉధృతంగా ప్రవహిస్తోందన్నారు. దీంతో ఆ రహదారి గుండా వెళ్లే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా కానీ అక్కడ కొండవాగుపై బ్రిడ్జి నిర్మించడం లేదన్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.