నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు లో ఉన్న పలు ఎరువుల షాపులను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఎస్సై రజియా సుల్తానా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించి, గోడౌన్లలోని ఎరువులను తనిఖీ చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ.... అక్రమంగా ఎరువులను నిల్వ ఉంచినా, బ్లాక్ మార్కెట్లో ఎరువులను విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎరువుల షాపుల డీలర్లను హెచ్చరించారు.