ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాల ను నిర్వహించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్,వేములవాడ MLA ఆది శ్రీనివాస్ అన్నారు.గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ టెంపుల్ గెస్ట్ హౌస్ సమావేశం మందిరంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ,నిమర్జన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బీ.గితే లతో కలిసి సమావేశం నిర్వహించారు.ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగనున్నాయని,వీటికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు