అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఎస్సీ కార్యాలయం వద్ద మంగళవారం 11 గంటల నుంచి మూడు గంటల వరకు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో విద్యుత్ మీటర్స్ గా పని చేస్తున్న కార్మికులకు రెండు నెలలు వేతనం ఈపీఎఫ్ ఈఎస్ఐ వెంటనే చెల్లించాలని లేకపోతే విద్యుత్ రీడింగ్ చేయకుండా నిరసన తెలుపుతామని ఏఐటీయూసీ రాజారెడ్డి రాజేష్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.