కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ...చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతిక అన్నారు.