సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రోడ్డు భద్రత కమిటీ, మత్తు పదార్థాల వినియోగ నివారణకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ హైమావతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రోడ్డుపై ప్రయాణించి ప్రతి వాహనదారులు భద్రత అతిముఖ్యంగా భావించాలని అధికారులకు తెలిపారు. రోడ్డుకు ఇరువైపుల చెట్లు రోడ్ మీదకి కొమ్మలని తొలగించాలనీ, ప్రతి గ్రామాల్లో రోడ్ దాటడానికి ఒకటి మాత్రమే డివైడర్ కటింగ్ ఉండాలని అనధికారిక డివైడర్ కటింగ్ లు క్లోజ్ చేసేందుకు కఠినంగా వ్యవహరించాలనీ ఎచ్ కే ఆర్ అధికారులను ఆదేశించారు. అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స