ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన సయ్యద్ సమీనా 2020 సంవత్సరంలో ఒక వ్యక్తితో జరిగిన గొడవ కారణంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయబడింది. కోర్టు పేచీలకు ఆమె గైర్హాజరుకావడంతో, నిజామాబాద్ స్పెషల్ ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎల్లారెడ్డి పోలీసులు ఆమెను గురువారం రోజు అదుపులోకి తీసుకుని నిజామాబాద్ స్పెషల్ ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ - బెలబుల్ వారెంట్ జారీ చేసింది అని తెలిపారు. కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆమెకు రిమాండ్ విధించారు అని ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు.