ఎమ్మిగనూరు: గోనెగండ్లలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొన్నిరోజులుగా వర్షం కురుస్తుండటంతో పత్తి వేరుశనగ ఉల్లి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పంటలు చేతికి వస్తున్న తరుణంలో అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. YSR సర్కిల్, కర్నూల్ ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా వర్షపు నీరు నిలబడి, గుంత లోతు తెలియక వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.