గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగని సమీపంలో శనివారం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. గాయపడిన వారిలో ఒకరికి చేతికి, మరొకరికి కాలికి గాయాలు కాగా, బస్సు క్లీనర్కు నడుముకు దెబ్బ తగిలింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు గాయాలైన వారిని పెదనందిపాడు ప్రభుత్వ వైశ్యాలకు తరలించారు.