బాపట్ల పట్టణం ఎన్జీవో హోమ్ లో బుధవారం రెడ్ క్రాస్ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ కొల్లూరు వరదల సమయంలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని, వీటివల్ల జిల్లాకు మంచి పేరు వచ్చిందని నరేంద్ర వర్మ ప్రశంసించారు. రెడ్ క్రాస్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు.