నూజివీడు మండలం తుక్కులూరు గ్రామం లోని క్వారీ రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్మశాన వాటిక నుండి సిమెంటు ఇటుకలు, మట్టి పేదలు నివసించే ప్రాంతంలోని రోడ్డుపై గుట్టలుగా పోసారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎంపీడీవో చెన్న రాఘవేంద్రనాథ్, నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంత్రి పార్థసారథి ఆదేశాలతో నూజివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాసు రెవిన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, పోలీసులు గ్రామస్తులతో మాట్లాడి గుట్టలను తొలగించారు. అనుమతి లేకుండా మట్టి తరలించిన వారిపై చర్యలు చేపడతామని అధికారులు తెలిపా