బతుకమ్మ పండుగ మహిళా సోదరీమణులకు అతిపెద్ద పండుగ అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ న్నారు.గురువారం కలెక్టరేట్లో మహిళా,శిశు సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిలతో కలిసి మహిళలతో బతుకమ్మ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకు ఒక ప్రత్యేక అనుభూతి అన్నారు బతుకమ్మ పండుగ మహిళలకు అన్ని పండగల్లో పెద్ద పండుగ అన్నారు.