మహబూబ్ నగర్ జిల్లాలోని టీఎన్జీవో భవనంలో వినియోగదారుల హక్కుల రక్షణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహిచారు. సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రాణం, ఆస్తికి ప్రమాదం కలిగించే వస్తువుల నుంచి వినియోగదారులు ఎలా రక్షణ పొందవచ్చో వివరించారు. వస్తువుల పరిమాణం, స్వచ్ఛత, నాణ్యత, ధర గురించి తెలుసుకునే హక్కు, వివిధ ఉత్పత్తులు, సేవలను పొందే హక్కుల గురించి ఆయన ప్రస్తావించారు. న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు.