దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారి, ఎంపీడీఓకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కేబీఆర్ గౌడ్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులకు సరైన సమయంలో యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు