డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో ఈ నెల నాలుగో తేదీన జరిగిన వినాయక నిమజ్జన సమయంలో అగ్రవర్ణ కులాలకు చెందిన మున్నూరు కాపులు మాదిగ కులస్తులపై లడ్డు వేలం పాటలో అసభ్యకరమైన మాటలతో దుర్భషలాడారని ఎమ్మార్పీఎస్ నాయకులు వాపోయారు. దీంతో సోమవారం నాడు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుల ఆధ్వర్యం బాధితులు పోలీస్ కమీషనర్ కలసి వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై స్పందించిన సిపి ఈ విషయమై విచారణకు డిచ్పల్లి ఎస్సైకి సూచించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు సుధాకర్ తో పాటు పలువురు మాదిగ కులస్తులు పాల్గొన్నారు.