అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మేరీ మాత చర్చి ఎదురుగా నిలిపి ఉంచిన హోండా షైన్ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన మారుతి ప్రసాద్ బుధవారం రాత్రి పని నిమిత్తం మేరీ మాత చర్చి వద్దకు వెళ్ళాడు. అక్కడ పని ముగించుకొని తిరిగి వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. చుట్టుపక్కల గాలించినా కనిపించలేదు. బైక్ చోరికి గురైనట్టు భావించి గురువారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.