కరీంనగర్ లో సిపిఎం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి శుక్రవారం తెలిపారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, రాజ్యాంగబద్ధ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కలరాస్తూ, ఈ దేశాన్ని నియంత్రత్వం వైపు మోదీ సర్కార్ తీసుకు వెళుతుందని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుని పై ఉందన్నారు.