ఐదు రోజులపాటు పంజాబ్ రాష్ట్రంలోని చండీఘర్లో జరిగిన సిపిఐ 25వ జాతీయ మహాసభలు గురువారంతో ముగిశాయి.ఈ మహాసభకు భద్రాద్రి జిల్లా నుంచి తొమ్మిదిమంది ప్రతినిధులుగా పాల్గొన్నారు. గురువారం జరిగిన జాతీయ సమితి ఎన్నికల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎమ్మెల్యే,కొత్తగూడెంకు చెందిన కూనంనేని సాంబశివరావు జాతీయ కార్యవర్గ సభ్యులుగా తిరిగి ఎన్నికయ్యారు. జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాకి తొలిసారిగా జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు.