క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని ప్రజలను మోసం చేసిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ ను అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి శుక్రవారం తెలిపారు..కోతి రాంపూర్ కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ క్రిప్టో కరెన్సీ పేరిట మోసం చేశారని భాస్కర్ అనే వ్యక్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.అధిక మొత్తంలో లాభాలు వస్తాయని మరో 17 మంది వద్ద 1.20 కోట్లు వసూలు చేశాడని, ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి కట్ల సతీష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.