మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ కు హాల్టింగ్ ఇప్పించేందుకు కృషిచేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి మందమర్రి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు బండి సదానంద యాదవ్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బండి సదానంద యాదవ్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల మరియు సింగరేణి ప్రాంత ప్రజల సౌకర్యం కోసం ఈరోజు వందే భారత్ ట్రైన్ మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రైల్వే మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపి హాల్టింగ్ ఇప్పించడం జరిగిందని గడ్డం కుటుంబానికి, ప్రజలందరూ రుణపడిఉన్నారన్నారు