కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో నల్ల రామయ్య పల్లి లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ ను పంపిణీ చేశారు.యూరియా సమస్యపై స్పందిస్తూ యూరియా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదని అది కేంద్రం చూసుకుంటుందని అన్నారు. యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బంది పడడం బాధగా ఉందన్నారు. అధిగమించాలని కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులం చాలాసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. జిల్లా కలెక్టర్ తో కూడా ప్రతిరోజు మాట్లాడుతున్నామని రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని తెలిపారు.