కామారెడ్డి : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గంపగోవర్ధన్ మరియు BRS పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ లో మరియు కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా మరియు రస్తా రోకో కార్యక్రమం చేపట్టారు. ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి,కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతుందన్నారు.