కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో గత రెండు రోజుల నుంచి హై డ్రామా కొనసాగింది. గురువారం విచిత్రమైన సంఘటన నెలకొంది.అదనపు మున్సిపల్ కమిషనర్ సువార్త ను పలు ఆరోపణల పై హైదరాబాద్ CMDA కు బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అదనపు కమిషనర్ సువార్త మాత్రం తాను బదిలీపై వెళ్ళనని రెండు రోజుల నుంచి తన కార్యాలయానికి వచ్చి ఛాంబర్ కి వస్తు వెళ్తుంది. సాయంత్రం తాళం వేసుకొని వెళ్లిపోన తర్వాత పై అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది, పంచుల సమక్షంలో ఛాంబర్ తాళాలు బ్రేక్ చేసి, కొత్త తాళాలను బిగించారు.ఛాంబర్ బయట ఉన్న నేమ్ ప్లేట్ సైతం తొలగించారు. బదిలీ అయిన వెళ్లకపోవడం చర్చనీయం