చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి యూరియా కోసం రైతులు పడి గాపులు కాస్తున్న రైతులు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డిగ్రీ కళాశాల సమీపంలో గల యూరియా దుకాణం వద్ద బారులు తీరిన రైతులు. మండల వ్యాప్తంగా రెండు యూరియా దుకాణాలలో 660 బస్తాలు యూరియాను సోమవారం పంపిణీ చేసినట్లు ఏవో రాధా తెలిపారు. ఒక్కొక్క రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. యూరియా కోసం రైతులు తోపులాడుకోవడంతో కిందపడ్డ రైతులు. సిఐ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఎస్ఐలు హరిప్రసాద్. కె.వి రమణ , ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ, పోలీస్ సిబ్బంది యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఘటనలు తెలియకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.