ఎమ్మిగనూరులో ఉల్లి రైతుల ధర్నా..ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రామచంద్రయ్య మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర లేక రైతులు పండిన ఉల్లిని పొలాల్లోనే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్వింటాలకు రూ.3,000 మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.