ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ంగానికి చిత్తశుద్ధి కరువైందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు శనివారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై అధ్యయనం కార్యక్రమం పాల్వంచ పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీ,బాపూజీ నగర్ లల్లో సర్వే చేపట్టారు.ఈ సందర్భంగా ప్రజలు 10 సమస్యలను సిపిఎం బృందానికి వివరించారు.20 సంవత్సరాలు నుంచి ప్రభుత్వ భూమిలో ఇల్లు వేసుకొని ఉంటున్న 40 కుటుంబాలు ఇంటి నెంబర్లు, కరెంటులేక ఇబ్బందులు పడుతున్నామని ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు..