నల్గొండ జిల్లా, మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి రాజశేఖర్ రాజు మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాడుగులపల్లి మండల కేంద్రంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 11 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 1350 గ్రాముల గంజాయి, 22 గంజాయి చాక్లెట్లు, మూడు బైకులు, 8 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని రిమాండ్ గా తరలించడం జరిగిందని తెలిపారు. పూసలపాడు కు చెందిన కొండేటి యశ్వంత్, మిర్యాలగూడ సీతారాంపురం కు చెందిన సమీర్ కలిసి బీహార్ కు చెందిన రాజు పటేల్, సికిందర్ ల ద్వారా ఈ విక్రయాలు జరుపుకున్నట్లు తెలిపారు.