ఏడాది కాలంలో పర్యాటక రంగంలో దాదాపు 12,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేక కట్టడాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని అప్పుఘర్ వద్ద ఆధునికీకరణ పనులు పూర్తి చేసుకొని పర్యాటకుల సౌకర్యార్థం సిద్ధమైన హరిత హోటల్(యాత్రినివాస్) ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. యాత్రి నివాస్ లో జరిగిన పనులను, ఏసీ సూట్, ఏసీ డీలక్స్, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్‌లు, మీటింగ్ హాల్ ను, బార్ అండ్ రెస్టారెంట్ ను పరిశీలించారు. పర్యాటక శాఖ అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.