విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా 28 ఆగస్ట్ 2000 వ సంవత్సరంలో హైదరాబాద్ బషీర్బాగ్ వద్ద నిరసన కార్లపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో.. కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అసువులు బాసిన విషయం తెలిసిందే... ఈ సందర్భంగా గురువారం కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో అమరులైన కామ్రేడ్స్ కు నివాళులర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ... ప్రజలకు అవసరం లేని స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.