గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. మైలారడ్డలోని బాలాజీ స్వీట్ హౌస్ వద్ద అనారోగ్యంతో కింద పడి ఉన్న దాదాపు 65-70 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోలింగ్ సిబ్బంది గమనించారు. గాంధీ ఆసుపత్రికి తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. డెడ్ బాడీని గాంధీ మార్చురికి తరలించి భద్రపరిచారు