యూరియా కష్టాల కంటే నానో యూరియా పిచికారి పద్ధతి చాలా సులభమని అన్నారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో రైతులకు నానో యూరియా పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు వ్యవసాయ అధికారులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ... రైతులు పంటలకు నానో యూరియా వాడాలని సూచించారు. యూరియా కంటే నానో యూరియా మెరుగ్గా పనిచేస్తుందని తెలిపారు. అధికారులు కూడా రైతులకు నానో యూరియా పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. నానో యూరియ