గిరిజన మహిళకు అరుదైన ఆపరేషన్ ను పాడేరు జిల్లా ఆసుపత్రి వైద్యులు శనివారం ఉదయం 9 గంటల సమయంలో నిర్వహించారు. డాక్టర్ తమర్బ నరసింగరావు వైద్య బృందం అరుదైన వైద్యం నిర్వహించి మహిళ కడుపులో కణితిని తొలగించారు. పాడేరు ముంచంగిపుట్టు మండలం పెద్ద గూడ కి చెందిన రామలక్ష్మి గత ఏడాది కాలం నుండి తీవ్ర కడుపు నొప్పి, రక్త స్రావంతో బాధపడుతూ వారం రోజుల క్రితం పాడేరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. మాతా శిశు సంరక్షణ విభాగానికి చెందిన డాక్టర్లు టెస్ట్ లు చేసి ఆమె కడుపులో భారీ కణితి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి 3 1/2 కేజీల గర్భ సంచి లో కణితిని తొలగించారు.