గుంటూరు జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని సరస్వతి విద్యాలయంలో జరిగిన ఆరవ ఏపీ రాష్ట్ర స్థాయి యోగాసన ఛాంపియన్ షిప్ పోటీలలో గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ పులి బాబు సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ పోటీలలో 5 విభాగాల్లో రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి 550 మందికి పైగా యోగా అథ్లెట్స్ పాల్గొన్నారు. ఈ పోటీల్లో కానిస్టేబుల్ పులిబాబు ద్వితియ స్థానంలో నిలిచాడు. రాష్ట స్థాయిలో ద్వితీయ స్థానం కైవసం చేసుకొని గుంతకల్లు సబ్ డివిజన్ పోలీసులకు పేరు ప్రతిష్టలు తెచ్చాడని డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు.