90శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తున్న రాజా మా విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు రైతులకు సూచించారు. మంగళవారం జీకేవీధి రైతు సేవా కేంద్రంలో స్థానిక సర్పంచ్ సుభద్ర, వైస్ ఎంపీపీ ఆనందరావు, టీడీపీ మండల అధ్యక్షుడు దేవుడు తదితరులతో కలిసి రాజ్ మా విత్తనాల పంపిణీ ప్రారంభించారు. గిరిజన రైతులు సాంప్రదాయ పంటలను, ప్రకృతి వ్యవసాయ సాగు పద్దతిలో పండించాలని కోరారు.