బీజేపీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు అన్నారు. బ్రాడీపేటలో బుధవారం జరిగిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ అభినందన సభలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని తెలిపారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో మంచి స్థానం కలిగిస్తామని పేర్కొన్నారు.