బెజ్జూరు మండలంలోని సుశ్మీర్ ఓర్రెలు, చింతల మానేపల్లి మండలంలోని దిందా వాగు భారీగా ఉప్పొంగాయి. వర్షకాలం వచ్చిందంటే చాలు రెండు మండలాలలోని మారుమూల గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. గిరిజన గ్రామాల కు వర్షకాలంలో రాకపోకలు నిలిచిపోవడంతో బాహ్య ప్రపంచానికి గిరిజన గ్రామాలు దూరం అవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఓర్రెలపై వాగులపై వంతెనలను నిర్మించేందుకు అనుమతులు తీసుకువచ్చి మారుమూల గ్రామాలకు రవాణా మెరుగుపడేలా చూడాలని కోరుతున్నారు,