Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
లింగసముద్రం (M) మొగిలిచర్లలో మంగళవారం రాత్రి ఆవుల శ్రీను (48) హత్యకు గురయ్యాడు. కొన్నేళ్ల క్రితం ఆయన భార్య చనిపోయింది. కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన ఆయన ఒంటరిగా జీవిస్తున్నాడని స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి పడుకున్న శీను తెల్లారేసరికి మంచంపై విగత జీవిగా పడి ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు DSP బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.