తెల్లదొరల తూపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డిన ఆయన వీరత్వం, దేశ దాస్య విమోచన యజ్ఞంలో ఆంధ్రులను ఒక్క తాటిపై నడిపించిన ఆయన మార్గదర్శకత్వం అందరికీ ఆదర్శమని శాసనమండలి సభ్యులు, ఆంధ్రకేసరి అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కీర్తించారు. ఆంధ్ర కేసరి, ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన నేతల్లో ప్రధముడైన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఆంధ్రకేసరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా జరిగాయి.