రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటుగా మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం ఉదయం నుండి 7 PM వరకు ఒక్కరోజు బందు శాంతియుతంగా పాటించారు,ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు నరసయ్య మాట్లాడుతూ,గత 5,6 నెలలుగా కమిషన్ రావడంలేదని రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు,ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 6 నెలల కమిషన్ ఒకేసారి రేషన్ డీలర్ల ఖాతాలో జమ చేయాలని కోరారు,అలాగే పాత పద్ధతిలోనే రేషన్ డీలర్లకు నెల నెల ఒకేసారి కమిషన్ ఇవ్వాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రేషన్ డీలర్ల హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు,