శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ ఆర్డిఓ కార్యాలయం ఎదుట జరగనున్న వైసిపి అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి హిందూపురం నుండి భారీగా వైసీపీ శ్రేణులు తరలి వెళ్లారు . ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని విధాల రైతులను దగా చేసిందంటూ అందుకు నిరసనగా పెనుకొండ ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వైసిపి నాయకులు తెలిపారు. హిందూపురం నుండి 50 వాహనాల్లో తరలి వెళ్లారు వైసిపి నాయకులు, కార్యకర్తలు.