నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూర్చున్న వర్షం కారణంగా గు పాన్ పల్లి వాగు, బోర్గాం వాగులోకి వరద నీరు వచ్చి పొంగిపోలుతోంది. దీంతో వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి భారీగా నీరు చేయడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. బాధితులకు పునర్వశ కేంద్రాలను కల్పించారు.