ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం.. వేములవాడ పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి సెప్టెంబర్ 17 రోజున నరేంద్ర మోడీ పుట్టినరోజు ఉత్సవాల కొరకు సేవా పక్షం కార్యక్రమాల కార్యశాల సమావేశం నిర్వహించారు.అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ మాట్లాడుతూ మోడీ పుట్టినరోజు ఉత్సవాలు 15 రోజులు పాటు రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి పిలుపునిచ్చారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎర్రం మహేష్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు దిక్సూచిగా పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ పుట్టినరోజు ఉత్సవాలు రక్తదాన శిబిరాలు చేపట్టాలని కోరారు