గంజాయి తాగుతూ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, చేర్యాల పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. చేర్యాల సిఐ శ్రీను శనివారం కేసు వివరాలు తెలియపరుస్తూ.. చేర్యాల కు చెందిన బొడ్డు చందు, చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి చెందిన పొన్నబోయిన పవన్ ఇద్దరు కలసి చేర్యాల పట్టణంలో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని నమ్మదగిన సమాచారం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, చేర్యాల పోలీసులు వెళ్లి రైడ్ చేసి ఇద్దరు నిందితులను పట్టుకొని విచారించగా హైదరాబాద్ లో గుర్తుతెలియని వ్యక్తి నుండి కొనుగోలు చేసుకున