విద్యార్థులకు ప్రతిరోజు పెట్టే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఉట్నూరు మండలంలోని లక్షిటిపేట గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిలో వెళ్లి నిత్యవసర సరుకులతో పాటు వంటగదిని పరిశీలించారు.అదే విధంగా తయారైన వంటను పరిశీలించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలకు నాణ్యమైన సరుకులను అందిస్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు నిరంతరం స్టోర్ రూంలను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.