చిన్నకోడూర్ మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన యువకుడు దురదృష్టవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందిన ఘటన సోమవారం విషాదం చోటుచేసుకుంది. పెద్దకోడూరు గ్రామానికి చెందిన అన్రాసి రాజు(22) కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. ఉదయం ఇంటి నుండి బయటకు వచ్చిన అతను, గ్రామంలోని ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు.కొంతసేపటికి ఆ మార్గంలో వెళ్లిన గ్రామస్తులు ఆ ఘటనను గమనించి అతని తండ్రికి సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యులు చేరుకొని, 108 అంబులెన్స్ ద్వారా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డ్యూటీ డాక్టర్ పరీక్షంచి అప్పటికే మరణించాడని తెలిపారు.